Tuesday, September 17, 2013

'వాధూలస' - గజల్

Rammohan Rao Thummuri


ఎంచుకుంటూ పోతె ఎన్నెన్నొ లోపాలు
తలచుకుంటే చాలు గుండెల్లొ గునపాలు

రగులుతున్నవి ఎదలు పగలతో సెగలతో
స్వార్థమున్నప్పుడే కోపాలు తాపాలు

నిన్ను నీవొకసారి లోలోన చూసుకో
ఎన్నగలవా ఎవరిలోనైన లోపాలు

మానవుని సేవయే మాధవుని సేవగా
మనసార ఎంచితే మలిగేను పాపాలు

'మోహనా' చంద్రునిలొ మచ్చ చూడకుమోయి
విరియు వెన్నెలలోన ఎన్నెన్ని మురిపాలు

17/9/2013